2021 ఏప్రిల్ వరకు సినిమాల సందడి బాగున్నా ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో బాక్సాఫీస్ వెలవెలబోయింది. మళ్లీ సెకండ్ హాఫ్ చివర్లో కొద్దిగా హడావిడి చేయగా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమా సత్తా చాటాయి. ఇదిలాఉంటే 2022 లో రాబోతున్న సినిమాల లెక్క చూస్తే మ్యాక్సిమం సీక్వల్ సినిమాల హంగామా కనిపిస్తుంది. 2022లో ఏప్రిల్ లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వస్తుంది. ప్రశాంత్ నీల్, యశ్ మరోసారి కె.జి.ఎఫ్ 2 తో మరో బ్రహ్మాండాన్ని సృష్టించడానికి వస్తున్నారు. ఇప్పటికే చాప్టర్ 2 టీజర్ భాషతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమాని సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది.

అసలైతే ఏప్రిల్ లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అని ప్రకటించారు కానీ ఆ టైం కు వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక అనీల్ రావిపుడి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ ఎఫ్2 సీక్వల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 2ని మించి కామెడీతో అలరిస్తారని తెలుస్తుంది. ఇక 2022లో రాబోతున్న మరో సీక్వల్ హిట్2. శైలేష్ డైరక్షన్ లో తెరకెక్కిన విశ్వక్ సేన్ హిట్ మూవీ క్రేజీ సీక్వల్ గా హిట్ 2 వస్తుంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

2022లో రాబోతున్న మరో సీక్వల్ మూవీ పుష్ప 2. పుష్పతో పాన్ ఇండియా లెవల్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన బన్నీ పుష్ప రాజ్ గా తన ఊర మాస్ నటనా ప్రతిభని చూపించాడు. పుష్ప 2 ది రూల్ పార్ట్ 1 కన్నా భారీ అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు. దీనితో పాటుగా నిఖిల్, చందు మొండేటి కార్తికేయ 2 కూడా ఈ ఇయర్ సీక్వల్స్ హంగామాలో పాలు పంచుకుంటుంది. మంచి విష్ణు, శ్రీను వైట్ల కాంబోలో 14 ఏళ్ల క్రితం హిట్ అయిన ఢీ కి సీక్వల్ గా ఢీ & ఢీ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. 2022లో సీక్వల్స్ కి బాగా కలిసి వస్తుందని ఈ సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు హిట్ హింట్ ఇచ్చేశాడు. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా బంగార్రాజు మూవీని అద్భుతంగా అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించారు కళ్యాణ్ కృష్ణ.


మరింత సమాచారం తెలుసుకోండి: