టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా తొలిసారిగా నువ్వు నాకు నచ్చావ్ మూవీతో అడుగుపెట్టిన భామ ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆ సినిమాని విజయ భాస్కర్ తెరకెక్కించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ మూవీని నిర్మించారు. అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ గా ఆర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అనేక అవకాశాలు అందుకుని వాటితో పలు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు ఆర్తి అగర్వాల్.

ఇక అప్పట్లో యువతలో విశేషమైన ఆదరణ దక్కించుకున్న ఆర్తి తెలుగులో దాదాపుగా అనేకమంది స్టార్ నటుల సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే నటిగా మంచి పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె ఆస్తి పాస్తులు కూడా బాగానే కూడబెట్టినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఆర్తి 2003 తరువాత సమయంలో మంచి ఆఫర్లు అందుకుంటూ ఉండడంతో పాటు ఆమె పారితోషికం కూడా బాగా పెంచారని, అలానే ఆ సమయంలో ఆమెతో పాటు తరచు సెట్ కి వచ్చే ఆమె తండ్రి ఆమె బాగోగులు, సినిమా వ్యవహారాలు చూసుకునేవారని, అది మాత్రమే కాక ఆమె సంపాదనని ఆయన పలు స్థిర ఆస్తుల రూపాల్లో కొనుగోలు చేసారని టాక్.

ఇక రాను రాను ఆర్తికి మెల్లగా అవకాశాలు తగ్గడం జరిగిందని, అయితే ఆర్తి ఫ్యామిలీ మాత్రం ఆ ఆస్తులని అలాగే నిలిపి ఉంచగా అనంతరం అవి ఎన్నో రెట్లు పెరిగాయని సమాచారం. ఇక కొన్నేళ్ల తరువాత ఆమె తన ఫ్యామిలీ తో కలిసి అమెరికా వెళ్లడం, అనంతరం బాగా బరువు పెరగడంతో, ఆపైన మళ్ళి సినిమాల్లోకి రావాలని భావించిన ఆర్తి అక్కడే లైపోశిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడంతో అది వికటించి ఆమె హఠాత్తుగా మరణించడం జరిగింది. అయితే ఆమె మరణానికి అసలు కారణం ఏమిటంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కాగా ఆ విధంగా ఆర్తి మరణం నిజంగా ఆమె ఫ్యాన్స్ కి మాత్రమే కాదు యావత్ తెలుగు ఆడియన్స్ కి ఎంతో విషాదాన్ని మిగిల్చింది. మొత్తంగా ఆర్తి ప్రస్తుతం మన మధ్యన లేనప్పటికీ ఆమె కెరీర్ లో బాగా సంపాదించి కొనుగోలు చేసిన ఆస్తులు మాత్రం ప్రస్తుతం ఆమె కుటుంబపరం అయినట్లు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: