నేషనల్ లెవల్ లో అల్లు అర్జున్ సత్తా ఏంటన్నది వీర లెవల్ లో ప్రూవ్ చేసింది పుష్ప సినిమా. ఈ సినిమాను సుకుమార్ ఏ రేంజ్ లో ఊహించుకుని చేశాడో కానీ ఆడియెన్స్ మాత్రం పుష్పని నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్లారు. ఓ విధంగా పుష్ప సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయడం ఓ క్రేజీ ఐడియా అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లకి ఈక్వల్ గా హిందీలో కలక్షన్స్ దుమ్ముదులిపేశాయి. నార్త్ ఆడియెన్స్ కి పుష్ప రాజ్ మాస్ మసాలా యాటిట్యూడ్ బాగా ఎక్కేసింది. అయితే ఈ రేంజ్ లో హిట్టైన పుష్ప సినిమా మీద ఇన్ డైరెక్ట్ పంచ్ వేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.

అదెలా అంటే ఆయన నిర్మాణంలో తన కో ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన రోఉడీ బాయ్స్ సినిమా కలక్షన్స్ అప్డేట్ ఇస్తూ ఆ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా ఫుల్ రన్ అయ్యాకే ఓటీటీ రూల్స్ ప్రకారం థియేట్రికల్ రన్ 50 రోజులు పూర్తి చేశాకే డిజిటల్ రిలీజ్ అవుతుందని అన్నారు. అంటే రౌడీ బాయ్స్ సినిమా మార్చి నెలాఖరులో ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దిల్ రాజు ఇలా చెప్పడం పుష్ప మీద పంచ్ వేసేందుకే అంటున్నారు కొందరు విశ్లేషకులు.

డిసెంబర్ 17న రిలీజైన పుష్ప సినిమా 20 రోజుల్లోనే డిజిటల్ రిలీజ్ చేశారు. జనవరి 7 నుండి అమేజాన్ ప్రైం లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా చెప్పలేదు కానీ వేరే సినిమాల్లా కాకుండా తమ సినిమా ముందు అనుకున్నట్టుగా 50 రోజుల తర్వాతే డిజిటల్ రిలీజ్ ఉంటుందని అన్నారు. మరి సడెన్ గా పుష్ప మీద దిల్ రాజు ఇలా పంచ్ వేయడం వెనక రీజన్స్ ఏంటో అర్ధం కాలేదు. పుష్ప మాత్రం థియేట్రికల్ రన్ లోనే కాదు డిజిటల్ స్పేస్ లో కూడా రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: