ఫ‌ల‌క్‌నుమాదాస్ నుండి పాగ‌ల్ వ‌ర‌కు వైవిద్య‌మైన క‌థా చిత్రాల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్నాడు విశ్వ‌క్‌సేన్‌. ఇప్పుడు ఈ టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ప్ర‌ధాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. విశ్వ‌క్ స‌ర‌స‌న రుక్సార్ న‌టిస్తున్న‌ది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బీ.వీ.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుదీర్ ఈద‌ర నిర్మిస్తున్నారు. రాజావారు రాణిగారు సినిమా ద‌ర్శ‌కుడు ర‌వికిర‌ణ్  కోలా ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే  అందిస్తూ ఉన్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల అయిన పోస్ట‌ర్లు, వీడియోలు మూవీపై అంచ‌నాల‌ను బారీగానే పెంచాయి. తాజాగా విడుద‌లైన ఓ ఆడ‌పిల్ల నువ్వు అర్థం కావా అనే సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

మాట రాని మాయ‌వా.. మాయ జేయు మాట‌వా.. మాటులోని మ‌ల్లెవా.. మ‌ల్లె మాటు ముల్లువా.. వ‌య్యారివా.. క‌య్యారివా సింగారివా సింగాణివా. రాయంచ‌వా.. రాకాసివా.. లే మంచులో లావా నీవా..ఓ ఆడ‌పిల్ల నువ్వు అర్థం కావా.. నా జీవితంతో ఆటాడుతావా అంటూ కొన‌సాగే ఈ పాట ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్న‌ది. ఇదివ‌ర‌కు హీరో విశ్వ‌క్ సేన్ పాత్ర అర్జున్ అని, త‌న‌కు ముప్పై ఏండ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేదు అని, జ‌ట్టు పోతుంది అని.. పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేసారు.

అదేవిధంగా ఇటీవ‌ల విశ్వ‌క్‌సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ.. సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు కూడా మంచి స్పంద‌నే రావ‌డం విశేషం. ఇప్పుడు విడుద‌ల చేసిన బ్రిజీ మెలోడియ‌న్ సాంగ్ ఓ ఆడ‌పిల్ల సువ‌ర్ణ కావా అనేది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ది. జైక్రిష్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. ఆయ‌న సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ పాట‌ను అనంత శ్రీ‌రామ్ రాయ‌గా.. రామ్ మిర్యాల పాడారు.  ఈ సినిమాకు కె.ప‌వ‌న్ సినిమాటోగ్రీ అందిస్తుండ‌గా.. విప్ల‌వ్ ఎడిట‌ర్‌, ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్నీ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్ అందిస్తాం అని చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: