నిన్నటి రోజున నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు.. తాజాగా నిన్నటితో 32 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు, ఆయన అభిమానులు కూడా ఈ హీరోకి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది. ఇక ఈ హీరో కుటుంబ సభ్యులతో పాటు, మెగా ఫ్యామిలీ కూడా ఒక ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక వరుణ్ తేజ్ సోదరీమణులు లైన శ్రీజ, నిహారికలు తమదైన శైలిలో తమ అన్నకి ప్రేమతో ఎమోషనల్ సందేశాలను పంపించడం జరిగింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తన అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నిహారిక ఇలా మాట్లాడుతూ.. మీ పైన మాకు చాలా అపారమైన ప్రేమ ఉన్నది.. మీరు మా అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం మాకు చాలా బాగా నచ్చింది.. ఈ ఏడాది కూడా మీకు బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేసింది.. నిహారిక. ప్రస్తుతం ఇది కాస్త ట్రెండింగ్ గా మారుతోంది.ఇక మెగాస్టార్ కూతురు శ్రీజ.. తన తమ్ముడు వరుణ్ తేజ్ పై ఒక ప్రత్యేకమైన ప్రేమను కురిపించింది.. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని పోస్టులు పెట్టింది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.. పొడుగ్గా ఉన్న నువ్వు.. తెలివి చాలా తక్కువగా ఉంటుందనుకుంటున్నాను.. అందుకోసమే నేను ఉన్నది.. హా.. హా.. నా చిన్నతనంలో ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతోపాటు నాకు ఎన్నో రోజుల నుంచి సపోర్ట్ గా నిలిచి ఉన్నావు.. నీ మీద ప్రేమనేను మాటల్లో చెప్పలేను అని తెలియజేసింది శ్రీజ. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ కూడా వైరల్గా అవుతోంది.మొత్తానికి తన అన్న మీద ఉన్న ప్రేమను మెగాస్టార్ కూతురు, వరుణ్ తేజ్ చెల్లెల నిహారిక తెలియజేయడంతో వీరిద్దరిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ లో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: