ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది శృతిహాసన్. కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ అమ్మడు మళ్లీ రీ ఎంట్రీ తర్వాత మాత్రం సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది.. రీ ఎంట్రీ తర్వాత కూడా ఈ అమ్మడికి అదృష్టం బాగానే కలిసి వచ్చిందనే చెప్పాలి. ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ సినిమాలో నటించేందుకు అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది శృతి హాసన్.. అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనే చెప్పాలి.


 అంతే కాకుండా ఎన్నో గ్లామర్ పాత్రల్లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతోమంది మతి పోగొట్టింది. ఇక అటు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శృతి హాసన్ అభిమానులు అందరితో ఎప్పుడూ చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. ఇకపోతే  మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో కొన్నాళ్ళ వరకు సినిమాలకు దూరంగా ఉన్న శృతి హసన్.. అక్కడ వర్కౌట్ కాక పోవడంతో.. ఆ తర్వాత రవితేజతో కలిసి క్రాక్ సినిమాతో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్హిట్ అయింది. దీంతో ఏకంగా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది శృతిహాసన్. ఇకపోతే ఇటీవల కాలంలో తన బాయ్ ఫ్రెండ్ తో  కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడూ  రచ్చ చేస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది .



 బాయ్ ఫ్రెండ్ కలిసి కాస్త రొమాంటిక్గా ఉన్న ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది శృతిహాసన్. ఇలా కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు బాయ్ ఫ్రెండ్ తో గడిపేస్తోంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ గురించి రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయిపోయింది. మీ బాయ్ ఫ్రెండ్ శంతను ఎప్పుడు కలిశారు అంటూ ప్రశ్నించగా.. తొలిసారి 2018 లో అతని కలిశాను.. 2020 నుంచి మేము రిలేషన్షిప్ లో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: