రాజమౌళి తరువాత వరస హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ కు ‘ఆచార్య’ మూవీ చుక్కలు చూపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీ మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కరోనా పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ విడుదల అనేకసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ ఇండియాను కుదిపేస్తూ ఉండటంతో ఫిబ్రవరిలో విడుదల కావలసిన ‘ఆచార్య’ ను ఏప్రియల్ కు వాయిదా వేసారు.


ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘ఆచార్య’ నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో కొన్నిలోపాలు కనిపించడంతో ఆలోపాలను సరిదిద్ది క్వాలిటీ కోసం ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్ ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ రీవర్క్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నప్పటికీ గతంలో చిరంజీవికి ‘సైరా’ మూవీ ఇచ్చిన చేదు జ్ఞాపకాలతో ‘ఆచార్య’ మూవీ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న చిరంజీవి సూచనతో ఈసినిమాకు సంబంధించి కొరటాల ప్రతి సీన్ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నట్లు టాక్.


ఈమూవీ విడుదల తరువాత కొరటాల జూనియర్ ఎన్టీఆర్ తో తీయవలసిన మూవీ కథ పై కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత జూనియర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈమూవీని కూడ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యే కథ కోసం కొరటాల టీమ్ తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి రెండు మూడు కథలను కొరటాల జూనియర్ కు వినిపించినప్పటికీ తారక్ ఆ కథ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందలేదు అని అంటున్నారు. దీనితో అటు ‘ఆచార్య’ ఫైనల్ ఎడిటింగ్ చూస్తూనే జూనియర్ ను మెప్పించే కథ కోసం కథలు వ్రాయడంలో చేయి తిరిగిన కొరటాల కూడ టెన్షన్ లో ఉన్నాడు అన్న మాటాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: