కరోనా కారణంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ లోని కొన్ని చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి.ఫిబ్రవరి లో కరోనా తగ్గుముఖం పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అప్పుడు పోస్ట్ పోన్ అయిన సినిమాలు విడుదల తేదీనీ ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాలు గా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు విడుదల తేదీ ని సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నాయి. 

ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల అయ్యేవి.  అంతేకాదు ఈ రెండు సినిమాలు వస్తున్నాయని సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న మరికొన్ని ఇతర సినిమాలు కూడా తమ విడుదలను త్యాగం చేసుకొని పోస్ట్పోన్ అయిపోయాయి. కానీ అనూహ్య రీతిలో ఈ సినిమాలు విడుదల కాకపోవడం అందరినీ తీవ్రమైన నిరాశకు గురి చేశాయని చెప్పవచ్చు. దాంతో సంక్రాంతి స్లాట్ ఖాళీగా ఉండకూడదు అనే నేపథ్యంలో కొన్ని చిన్న చిత్రాలు విడుదల అయ్యాయి. వాటి సక్సెస్ ల సంగతి పక్కన పెడితే సంక్రాంతి సీజన్ ను అవి బాగా ఉపయోగించుకుని ఆయనే చెప్పాలి.

మంచి వసూళ్లను సంపాదించుకుని ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి ఆ చిత్రాలు. అయితే టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ రెండు భారీ చిత్రాలు ఎప్పుడు అయితే ఏప్రిల్ లో విడుదల కావాలని నిర్ణయించుకున్నాయో ఇప్పుడు  మరొకసారి సంక్రాంతి సీజన్ లో తలెత్తే పరిస్థితులు ఇప్పుడు ఎదురవడం ఖాయం అని తెలుస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ లో కొన్ని పెద్ద చిత్రాలు విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాయి. ఒకవేళ ఈ రెండు చిత్రాలు కూడా విడుదల అవ్వాలని తేదీనీ నిర్ణయించుకుంటే మాత్రం ఆ సినిమాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: