అప్పట్లో అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్తే.. ఎక్కువగా చెట్ల కింద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ , భోజనాలు చేసేవారమని సీనియర్ ఆర్టిస్టులు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. అప్పట్లో ఎక్కువగా సీనియర్లు, జూనియర్లు అనే భేదాలు లేకుండా ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోయాయి.. ముఖ్యంగా ఇప్పుడు అవుట్ డోర్ షూటింగ్లో అంటే కారవాన్లలోకి వెళ్ళిపోతున్నారు. ఇక అంతే కాకుండా ఆ షాట్ పూర్తయిన తర్వాత కొంత మంది ఆర్టిస్టులు అసలు కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. ఒక దశలో ఇలాంటి పద్ధతిని నిర్మాతలే హీరో,హీరోయిన్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కారవాన్లు ఉంచేవారు.

కానీ రానురాను కాలం మారుతున్న కొద్దీ హీరోలే ఖరీదైన విలాసవంతమైన కారువాన్లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇక వాటి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. షాట్ పూర్తయిన వెంటనే అందులోకి వెళ్ళి పోతూ ఉంటారు.మరొకసారి షాట్ రెడీ అనగానే బయటికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం హీరో నరేష్ కూడా ఈ కారవాన్ ను ఉపయోగించడం గమనార్హం.1980 వ సంవత్సరంలో హీరో నరేష్ తన హవా కొనసాగించాలని చెప్పవచ్చు.. ఎక్కువగా తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలోనే సినిమాలను చేసేవారు. దాంతో ఆయన ఖాతాలో బోలెడన్ని హిట్ వచ్చి పడ్డాయి. ఆ తర్వాత కొన్ని కారణాల చేత కెరియర్ పరంగా చాలా గ్యాప్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు నరేష్. టాలీవుడ్ లో అధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో నరేష్ కూడా మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి వారిని తప్పక ఎంచుకుంటున్నారు మూవీలలో. అలా కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నరేష్ ప్రస్తుతం బిజీ లైఫ్ లో గడుపుతున్నాడు. ఇక తన బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉండడంతో తన డిమాండ్ కు తగ్గ రెమ్యునరేషన్ ని అందుకుంటున్నాడు నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: