అక్కినేని అఖిల్ కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ గా బ్యాచిలర్ మూవీ క్రేజీ హిట్ కొట్టింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బన్నీ వాసు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించారు. సినిమాలో అఖిల్ కి జోడీగా బుట్ట బొమ్మ పూజా హెగ్దే మరోసారి తన గ్లామర్ మంత్రంతో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అఖిల్ అక్కినేని కెరియర్ కి మంచి జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా థియేట్రికల్ హిట్ అందుకోవడమే కాదు బుల్లితెర మీద సూపర్ అనిపించుకుంది.

బ్యాచిలర్ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఆహా ఓటీటీలో డిజిటల్ రిలీజ్ కూడా అయ్యింది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి వాచ్ అవర్స్ వచ్చాయని టాక్. అయితే లేటెస్ట్ గా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటింది. స్టార్ మాలో లాస్ట్ సన్ డే టెలికాస్ట్ అయిన బ్యాచిలర్ సినిమా 9.31 రేటింగ్ తో అదరగొట్టింది. అఖిల్ బ్యాచిలర్ కమర్షియల్ గా మంచి వసూళ్లను రాబట్టడమే కాదు బుల్లితెర మీద కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది. సినిమాని స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.

బ్యాచిలర్ సినిమాలో గోపీ సుందర్ మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ని అలరించేలా చేసింది. సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ సినిమా కి హైలెట్ గా నిలవడమే కాకుండా సినిమాని స్మాల్ స్క్రీన్ పై కూడా హిట్ అయ్యేందుకు ఆమె కాంట్రిబ్యూషన్ కూడా ఉందని అంటున్నారు. పూజా హెగ్దే గ్లామర్ బ్యాచిలర్ సినిమాకు ఓ రేంజ్ లో ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటు అదే రోజు టెలికాస్ట్ అయిన అరణ్య 5.09 టి.ఆర్.పి తెచ్చుకోగా.. ఎస్సార్ కళ్యాణమండపం 4.82 రేటింగ్ తెచ్చుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: