నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి నాని పట్టుబట్టి నిర్మాతను ఒప్పించి, తన డబ్బులు కూడా కొంత పెట్టుబడిగా ఉంచి సినిమాపై నమ్మకంతో శ్యామ్ సింగ రాయ్ ను థియేటర్లలో విడుదల చేయించాడు. అయితే ఈ చిత్రం రిజల్ట్ తేడా కొట్టిందనే చెప్పాలి మరి.

అయితే నిరాశ పూర్వక సమయంలో నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని ఇవాళ చిరంజీవి చూశారంట. అయితే ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా ఉందని నానిపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు.. ముఖ్యంగా నాని నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. అంతేకాక.. రేపటి వేళ నెట్ ఫ్లిక్స్ ద్వారా శ్యామ్ సింగరాయ్ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలోనే చిరు ప్రశంస తననెంతో ఉత్సాహపరించిందని హీరో నాని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవానికి ఈ సినిమా విషయంలో నానికి మొదటి నుండి ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ఇక చివరికి రెమ్యునరేషన్ మొత్తంలో ఐదు కోట్ల రూపాయలను కూడా వదులుకుని సినిమా రిలీజ్ కి సహకరించాడు. అంతేకాదు.. ఏపీలో టికెట్ ధరల దృష్ట్యా చాలా చోట్ల నిర్మాతకు నష్టాలే మిగిలాయని చెప్పుకొస్తున్నారు. ఇక సినిమా విడుదల ముందు నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ పెద్దలకు కోపం తెప్పించాయనే చెప్పాలిమరి.

ఇక ఏపీలో ప్రస్తుత కాలంలో ఏపీలో థియేటర్ వసూళ్ల కన్నా పక్కనే ఉన్న పాన్ డబ్బా వాలా కలెక్షన్ ఎంతో బెటర్ అని వ్యాఖ్యానించి సంచలనం అయ్యారు. నాని అలా అనడంతో మంత్రులు అంతా అలర్ట్ అయి నానిని టార్గెట్ చేయడం, శ్యామ్ సింగరాయ్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్న థియేటర్లపై దాడులు చేయించి మూసి వేయించడం లాంటివి వేశారు.

ఈ చిత్రానికి  అస్సలు రావాల్సిన కనీస స్థాయి వసూళ్లు కూడా రాకుండా రాలేదంట. అదే సమయంలో  ఓవర్సీస్ లోనూ అంతగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. ఇక ఏది ఏమైనప్పటికి సినిమా ఆశించిన విధంగా నడవలేదు.. ఆశించిన విధంగా వసూళ్లు సాధించలేదనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: