ఇండస్ట్రీలో చాలా నటులు విడాకుల బాట పడుతున్నారు. గతేడాది నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోగా, ఈ ఏడాది ఆరంభంలో ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే సెలెబ్రెటీలు విడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఇండస్ట్రీలో చాలా మంది తమకు తమ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. ఇక బయటికి ఆనందంగా కనిపిస్తూ, మేము హ్యాపీగా ఉన్నాం అని చూపించడంకంటే ఒకవేళ వైవాహిక జీవితం బాగోకపోతే విడిపోవడమే కరెక్ట్ అనుకుంటున్నారు. అయితే వారు కొన్నిసార్లు సినీ జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు.

అయితే విడిపోవడం అనేది వారి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇది కేవలం ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది మాత్రమేనని ఎవరు ఆ విషయంలో కలగజేసుకొని వారిద్దరి నిర్ణయాలని మార్చే హక్కు ఎవరికీ ఉండదు. ఆ జంటకు  పిల్లలు ఉంటే, ఆ పిల్లల బాగు కోసం ఆ జంట కలిసి ఉంటే, అది చాలా సమస్యలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే.. బాధపడుతూ కలిసి ఉండటం కంటే, విడిపోయి సంతోషంగా ఉండడం మంచిది అని అనుకుంటున్నారు. దీంతో పిల్లలు కూడా చిన్నప్పటి నుండి సర్దుకుపోయి బ్రతుకుతుంటారు.

ఇక మరికొంత మంది  జంటలు భార్యాభర్తలుగా విడిపోయినా కూడా, స్నేహితులుగా కలిసి ఎవరి జీవితం వారు గడిపేస్తున్నారు. అంతేకాదు..  భార్యాభర్తలుగా వారిద్దరికీ కుదరదు అని అనుకున్నప్పుడు, కేవలం ఆ బంధం నుంచి మాత్రమే విడిపోతారు కానీ, వారు తరచుగా మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని చాలా మంది జంటలు చెబుతున్నారు. ఇక సెలబ్రిటీ కపుల్స్ చిన్న వయసులోనే ఇదే ప్రేమ అనుకోని పెళ్లి చేసుకున్నాక అది ప్రేమ కాదని వారికీ అర్ధం అవుతుంది. దాంతో వారు సర్దుకుపోయి కలిసి ఉండటంకంటే విడిపోవడం మంచిది అని అనుకొని, మాట్లాడుకొని విడాకులు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: