టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పూరిజగన్నాథ్ శైలి ఎంతో ప్రత్యేకమైనది. ఆయన తొలి సినిమా నుంచి తన సినిమాలలో ఎంతో వైవిధ్యం ప్రదర్శించడంతో పాటు వినూత్నమైన పాయింట్ ను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కథ ఎలా ఉన్నా కూడా పాత్రల క్యారెక్టరైజేషన్ ఎంతో విభిన్నంగా ఉంటుంది ఆయన సినిమాలలో. అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాలో ఏదో ఒక పాత్ర తప్పకుండా అందరినీ ఎంతగానో ఆలోచింప చేస్తూ ఉంటుంది. 

ఇకపోతే హీరోలందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు పూరిజగన్నాథ్. ఎందుకంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్ ను బిల్డ్ చేసి వారు స్టార్ హీరో లు అవడానికి పునాదులు వేశాడు. ఆ విధంగా ఇప్పుడు పన్ ఇండియా హీరో లు గా ఎదిగిన చాలా మంది హీరోలకు పునాదులు వేసి వారు ఇంత దూరం వచ్చేలా చేశాడు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడంలో ఎలాంటి తడబాటు లేని పూరి జగన్నాథ్ ఆ సినిమా ను డైరెక్ట్ చేశాడు.

ఆ తర్వాత కాలంలో ఎంతమంది కమర్షియల్ దర్శకులు వచ్చినా కూడా తనకే సొంతమైన పాత్రల డిజైనింగ్ సినిమా చిత్రీకరణ తో ఇప్పటిదాకా అగ్ర దర్శకుడు గా కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా అదే పంథాలో కొనసాగుతున్నడు అని ఆయన చేసే సినిమా లను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న పూరీ ఎంతో అద్భుతంగా హీరో పాత్ర డిజైన్ చేశాడట. అంతే కాదు విజయ్ దేవరకొండ స్టైల్ ను మిక్స్ చేసి తనను తాను ఎలివే అయ్యే కూడా చేశాడట. మరి పూరి జగన్నాథ్ కాస్త వెనుక పడ్డాడు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలాంటి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: