టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే సక్సెస్ఫుల్ మ్యాన్ అనేస్తారు చాలామంది, ఎందుకంటే స్టూడెంట్ నంబర్ వన్ సినిమా మొదలు ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా హిట్టే కాదు, బ్లాక్ బస్టరే. ఆయన సినిమా తీస్తున్నాడు అంటే ఇక ఆ మూవీ సూపర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు. తెలుగు ప్రేక్షకులు, సినీ తారలు జక్కన్నపై పెంచుకున్న విశ్వాసం అలాంటిది. అందుకే స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్ లో సినిమా కోసం క్యూ కడుతుంటారు... ఛాన్స్ వచ్చిందా మిగిలినవన్నీ పక్కన పెట్టి జక్కన్న కోసం డేట్స్ ఇచ్చేస్తుంటారు. ఎన్ని రోజులు ఎంత షెడ్యుల్ అని అడగనే అడగరట.

అయితే ఇంత పెద్ద డైరెక్టర్ అగ్ర హీరోలతో సినిమా చేయాలని అస్సలు అనుకోరు తన కథకు ఎవరైతే సూట్ అవుతారో వారిని ఎంచుకోవడం ఆయన శైలి. అందుకే చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా వారితో సినిమాలు చేస్తుంటారు. జక్కన్న డైరెక్షన్ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలే కాదు హాస్య నటుడు సునీల్ కూడా సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసిన జక్కన్న ఇపుడు ఆ సినిమా విడుదల పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనంతరం వేరే పెద్ద ప్రాజెక్ట్ ను షురూ చేయాలనుకున్న జక్కన్న ఇపుడు దానికంటే ముందు ఒక సరికొత్త కథాంశంతో యంగ్ హీరో తో సినిమా తీయాలని అనుకుంటున్నారు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇక ఆ సినిమాలో హీరోగా అక్కినేని అఖిల్ అయితే తన కథకు సరిగ్గా సరిపోతాడు అని పలువురు సినీ ప్రముఖులతో జక్కన్న అన్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే ఆ విషయాన్ని అక్కినేని నాగార్జునతో కూడా రాజమౌళి మాట్లాడటం అందుకు నాగ్ ఒకే చెప్పడం అయిపోయాయి అని సమాచారం. మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా... అక్కినేని అభిమానులు ఇది అఫిషియల్ వార్తగా వినిపించాలని ఎంతగానో కోరుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: