అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌ ఎంటర్‌టైనర్ 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి తెలుగులో మిక్స్‌డ్‌టాక్‌ వచ్చినా, మిగతా భాషల్లో మాత్రం క్రేజీ రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా తమిళ్‌, హిందీ స్టార్లు అయితే బన్ని పెర్ఫామెన్స్‌కి ఫిదా అవుతున్నారు. సూపర్‌ యాక్టింగ్‌ అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ఇండియన్‌ క్రికెటర్స్‌ని కూడా 'పుష్ప' ఫీవర్ తాకింది. శిఖర్ ధావన్ తగ్గేదేలే అని డైలాగ్ పోస్ట్‌ చేస్తే, రవీంద్ర జడేజా మరో అడుగుముందుకేశాడు. పుష్పరాజ్‌ గెటప్‌లోకి వెళ్లిపోయి మనం అస్సలు తగ్గం అని పోస్ట్‌ పెట్టాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ ఇద్దరూ శ్రీవల్లి సిగ్నేచర్‌ మూమెంట్‌ని దింపేశారు. 'పుష్ప' సినిమా హిందీలో 75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ, నైట్‌ కర్ఫ్యూ నిబంధనల మధ్య కూడా హిందీ బెల్ట్‌లో భారీగా వసూల్ చేసింది. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌కి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యాడు. దీంతో బన్నితో సినిమాలు తీసేందుకు హిందీ నిర్మాతలు చెక్కులు రెడీ చేస్తున్నారట.

ప్రభాస్‌కి 'బాహుబలి' ముందు వరకు తెలుగులో తప్ప బయట పెద్దగా మార్కెట్‌ లేదు. కానీ 'బాహుబలి' తర్వాత మొత్తం మారిపోయింది. పాన్ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగాడు. భారీ బడ్జెట్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. హిందీ ఆడియన్స్ అయితే ప్రభాస్‌ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ వసూళ్లు కట్టబెడుతున్నారు. ప్రభాస్‌ 'బాహుబలి' తర్వాత 'సాహో' సినిమా చేశాడు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ మూవీకి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వచ్చినా, హిందీలో మాత్రం 'సాహో' భారీగా కలెక్ట్‌ చేసింది. అక్కడ బ్లాక్‌బస్టర్ రిజల్ట్ వచ్చింది. ప్రభాస్‌ గ్రాఫ్‌కి భారీ బూస్టప్‌ వచ్చింది.  

ప్రభాస్‌కి హిందీ మార్కెట్‌లో స్టార్డమ్ వచ్చాక రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు ఏ సినిమా మొదలుపెట్టినా హిందీ మార్కెట్‌ని లెక్కలోకి తీసుకుంటున్నాడు. సౌత్‌, నార్త్‌ రెండు చోట్లా కామన్‌గా కనెక్ట్‌ అయ్యే కథలనే చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నార్త్‌లో కొంచెం ఎక్కువ అటెన్షన్‌గా ఉంటున్నాడు. 'రాధేశ్యామ్'కి సౌత్‌ కోసం జస్టిన్‌ ప్రభాకరన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకుంటే, హిందీ కోసం మిధున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్‌ లాంటి వాళ్లని తీసుకున్నాడు.

ప్రభాస్‌ 'ప్రాజెక్ట్-కె' సినిమాకి హిందీ టాప్ హీరోయిన్‌ దీపిక పదుకొణేని తీసుకొచ్చాడు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ని కీ-రోల్‌ కోసం ఒప్పించారు. అలాగే 'సలార్' కూడా పాన్‌ ఇండియన్‌ మూవీగానే తెరకెక్కుతోంది. ఇక హిందీ డైరెక్టర్ ఓం రౌత్‌తో 'ఆదిపురుష్' సినిమా చేశాడు. ఈ మూవీస్ అన్నింటికి ప్రభాస్‌ 100 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడు. అల్లు అర్జున్‌కి కూడా ఇలాగే హిందీ బెల్ట్‌లో మంచి గుర్తింపు వచ్చింది. సో ఈ రెస్పాన్స్‌ని క్యాష్‌ చేసుకుని బన్ని కూడా బాలీవుడ్‌లో భారీ సినిమాలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. పైగా హిందీ మార్కెట్‌ కూడా ఉంటే రెమ్యూనరేషన్‌ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ లెక్కలతో బన్ని కూడా పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా మారిపోతాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: