విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ చిత్రం దాదాపుగా పూర్తి అయ్యే స్టేజ్ కి వచ్చిందని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఈ ఇద్దరి అభిమానులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్బస్టర్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని ఎన్నో హంగులతో ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా రూపొందిస్తున్నాడు. అలా తాను దర్శకత్వం వహించే ఏ సినిమాకు ఎక్కువగా టైమ్ తీసుకోని పూరి జగన్నాథ్ తొలిసారి ఈ సినిమాపై భారీ టైం పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ గ్లింప్స్ విడుదల కాగా అవి భారీ స్థాయిలో ప్రేక్షకుల స్పందనను రాబట్టుకున్నాయి. అభిమానులు ఓ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన సెలబ్రేషన్ చేసుకున్నారు. అలా ఈ చిత్రం ఎన్నో ప్రాధాన్యతలను సంతరించు కోగా అదనపు ఆకర్షణగా ఏ ఇండియన్ సినిమా కు సాధ్యం కాని విధంగా హాలీవుడ్ నటుడు బాక్సర్ అయన మైక్ టైసన్ ఈచిత్రంలో నటిస్తుండటం విశేషం. ఇది ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలను కలిగించే విషయం అని చెప్పవచ్చు.

అయితే ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ స్టార్ ను పెట్టుకొని పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని బయటకు ప్రొజెక్ట చేస్తూ ఉండగా ఇప్పుడు మరొక ఇంటర్నేషనల్ స్టార్ ఈ సినిమాలో  పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు ఆలోచనలో చేస్తున్నారట. ఈ సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ కోసం పాన్ వరల్డ్ బ్యూటీ ఎంపిక చేయాలని వీరు భావిస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా అవకాశం అందుకునే పాన్ వరల్డ్ బ్యూటీ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే కనుక జరిగితే  ఈ విజయ్ దేవరకొండ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉంటాయి అని చెప్పవచ్చు. తొందరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: