టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో తాజాగా వెండితెరకు పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదలైంది. ఆయన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అశోక్ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇక ఇంటర్వ్యూలో అశోక్ మాట్లాడుతూ..' శ్రీరామ్ ఈ కథ వినిపించినప్పుడే చాలా కమర్షియల్ గా ఈ సినిమా చేయాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉండేలా తీయాలని అనుకుంటున్నా అని నాతో అన్నాడు. అయితే ఆయన అంతకు ముందు తీసిన సినిమాలు చూసి ఆ నమ్మకంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఇక ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు నన్ను ఎవరూ కొత్త హీరోల చూడలేదు. దానివల్ల నేను కామెడీ బాగా చేయగలిగాను. ఇక నేను చెన్నైలో డాన్స్ నేర్చుకున్నాను. ఈ సినిమాకి ముందు గానే విజయ్ మాస్టర్ నాతో డాన్స్ ప్రాక్టీస్ చేయించారు అని అన్నాడు అశోక్.

అయితే ఈ సందర్భంగానే మన టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లు ఎవరూ అనేదానిపై కూడా కామెంట్ చేశాడు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ముగ్గురు కూడా మంచి డాన్సర్స్. బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పటం మాత్రం కష్టం. ఎన్టీఆర్ నాచురల్ డాన్సర్. ప్రాక్టీస్ లేకపోయినా ఆయన ఈజీగా డాన్స్ చేస్తాడు ఇక రామ్చరణ్ విషయానికొస్తే ఆయన డాన్స్ లో ఒక గ్రేస్ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ మనం చూడని స్టెప్స్ ని కూడా ఎక్కడోనుంచి తెచ్చి పెడుతుంటారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అశోక్.అంతేకాకుండా హీరో సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాడు. ఇక తన తదుపరి సినిమా విషయాల గురించి చెబుతూ ప్రస్తుతం మరొక స్క్రిప్ట్ మీద చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఫైనల్ అయ్యాక అన్ని విషయాలు చెబుతాను అని తెలిపాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: