టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న సినిమాల్లో 'రావణాసుర' సినిమా కూడా ఒకటి.యంగ్ డైరెక్టర్ సుదీర్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమా ఇటీవలే సంక్రాంతి పండగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా హైదరాబాదులో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టారు మేకర్స్. ప్రస్తుతం రాత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రవితేజ ఓ డేరింగ్ స్టెప్ వేస్తున్నారట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇలాంటి డేంజర్ టైంలో అవుట్ డోర్ షూటింగ్ చేయడానికి ఈ సినిమా యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా సినిమా టాకీ పార్ట్ మొత్తం అని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రావణాసుర సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని హైదరాబాద్ లోని రియల్ అండ్ న్యాచురల్ లోకేషన్లలో షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా కోసం ఒక్క సెట్ కూడా వేయడం లేదట. అయితే రవితేజ కెరీర్లో ఇలా చేయాలని అనుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఏదో ఒక సన్నివేశం కోసం సెట్ వేశారు. కొన్ని సినిమాలు సెట్స్ లోనే చేశారు.

కానీ రావణాసుర సినిమా కోసం మాత్రం ఎటువంటి సెట్ వేయకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాకీపార్ట్ షూటింగ్ న్యాచురల్ లొకేషన్స్ లో తెరకెక్కించేలా దర్శకుడు సుధీర్ వర్మ షెడ్యూల్స్ కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఇక ఆయన ప్లాన్ కు అటు రవితేజ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత క్రాక్ సినిమాలో కొంత పార్ట్ షూటింగ్ చేశారు రవితేజ. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ అనుభవంతోనే ఇప్పుడు ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఏదేమైనా నా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టాకీ పార్ట్ మొత్తం అవుట్ డోర్ షూటింగ్ అంటే రవితేజసినిమా కోసం పెద్ద సాహసమే చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: