మెగా ఫ్యామిలీ లో ఒక మెంబర్ గా ఉంటే సినిమా అవకాశాలకు కొదవే ఉండదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆయనకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. అదే ఆ కుటుంబం నుంచి కనుక బయటకు వస్తే ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాదు అనేది అక్షరాల సత్యం. ఎందుకంటే మెగా కాంపౌండ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆ విధంగానే ఆదరిస్తారు. దాదాపు మూడేళ్ల కిందట చిరు కుటుంబం నుంచి ఒక కొత్త హీరో వచ్చాడు. ఆయన పేరే కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్తనే ఈ కళ్యాణ్ దేవ్. పెళ్లి సమయంలోనే కళ్యాణ్ ని చూసి హీరో అవుతాడు అని అందరూ అనుకున్నారు.

అనుకున్నట్టుగానే 2018లో 'విజేత' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ దేవ్. మొదటి సినిమాకు మెగా ఫ్యామిలీ అంత వచ్చి అల్లుడిని బాగా ప్రమోట్ చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ కాకపోవడంతో కళ్యాణ్ కు కోరుకున్న బ్రేక్ రాలేదు. అయినా కూడా చిరంజీవి అల్లుడు కాబట్టి అతనికి మళ్లీ అవకాశాలు వచ్చాయి. అయితే ఈసారి మునుపటిలా మెగా కాంపౌండ్ సపోర్ట్ లేదు. మొన్న విడుదలైన 'సూపర్ మచ్చి' సినిమాని మెగా కుటుంబం అసలు పట్టించుకోలేదు. కనీసం ఆ సినిమాకు ప్రమోషన్ కూడా చేయలేదు. ఎందుకంటే శ్రీజతో ఇతనికి మనస్పర్ధలు మొదలయ్యాయని..

త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ.. ఇక కళ్యాణ్ కెరియర్ కి ఇక్కడితో ఎండ్ కార్డు పడినట్లేనని అందరూ అంటున్నారు. ఇక ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ దేవ్. కానీ ఈ సినిమా వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు ఏమాత్రం తెలియదు. మరోవైపు ఇప్పటి వరకు కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వలేదు ఈ మెగా అల్లుడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమై.. శ్రీజ తో కనుక విడాకులు తీసుకుంటే కళ్యాణ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోనట్లే. అందులో వేరే సందేహం కూడా అవసరం లేదు. మరి ముందు ముందు ఏం జరుగబోతోందో చూడాలిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి: