మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడు అయినప్పటికీ.. తమిళ సినిమాలతో యాక్టర్ గా మారాడు హరీష్ ఉత్తమన్ టాలీవుడ్లో మాత్రం కేవలం ఇతని విలన్ గానే పరిచయమయ్యాడు. అయినప్పటికీ కూడా అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో కూడా విలన్ల లో టాప్ పొజిషన్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ నటుడు రెండో వివాహాన్ని చేసుకోవడంతో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాడు. ప్రముఖ మలయాళ నటి అయిన చిన్ను కురువిల్ల ను రెండో వివాహం చేసుకున్నాడు హరీష్. నిన్నటి రోజున కేరళలోని మవెలిక్కర వద్దు ఉన్న ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు హరీష్ చిన్నులు.. ఆ వివాహం ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం వారి ఫోటోలు కూడా వైరల్గా మారుతున్నాయి.ఇక ఈ పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు.. ఈ నటుడు బంధువులు, సన్నిహితులు హాజరు కావడం జరిగింది. కేవలం పది వేల రూపాయల ఖర్చుతో వీరి వివాహం జరగడం గమనార్హం. 2018వ సంవత్సరంలో హరీష్ మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి అమృత కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటాడు.. కానీ వివాహమై కొద్ది రోజులు కాకముందే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో ఒక సంవత్సరం లోపే ఆ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఆ తర్వాత హరీష్ 2013వ సంవత్సరంలో వచ్చిన గౌరవం మూవీతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.ఆ తరువాత పవర్, పండగ చేస్కో, శ్రీమంతుడు, మలుపు, మరికొన్ని సినిమాలలోనటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండవ సారి వివాహం చేసుకున్న నటుడు హరీష్ కు ఆయన అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. సరి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావ్ నీ జీవితం చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఒక నటుడి ఉండి అతి తక్కువ ఖర్చుతో వివాహం చేసుకోకుండా వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: