దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్, సముద్ర కని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్,  ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు.  ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, అలాగే ఈ సినిమా ప్రమోషన్ లను కూడా ఈ చిత్ర బృందం పాన్ ఇండియా రేంజ్ లో నిర్వహించింది,  అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది,  అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు రెండు విడుదల తేదీలను  చిత్ర బృందం ప్రకటించింది, పరిస్థితులు అన్నీ అనుకూలించినట్లు అయితే 18 మార్చి 2022 న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది,  ఒకవేళ ఆ తేదీ కుదరకపోతే 28 ఏప్రిల్ 2022 న ఆర్ఆర్ఆర్ సినిమాను  విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇలా సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదీలను చిత్ర బృందం ప్రకటించింది.

 అలాగే ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది,  ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో ఈ సినిమా విడుదలను కూడా చిత్ర బృందం వాయిదా వేసింది,  అయితే ఇప్పటి వరకు రాదే శ్యామ్ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: