ఈ సమ్మర్లో ప్రేక్షకులందరికీ అదిరిపోయే సినీ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు హీరోలు  సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయ్.  ముఖ్యంగా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కే జి ఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే కేజిఎఫ్ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఇక రెండవ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి సినిమా విడుదలవుతున్న సమయంలో ఇక వేరే సినిమాలు కూడా విడుదలైతే వసూళ్ల విషయంలో మిగతా సినిమాలకు నష్టాలు తప్పవు.. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని విడుదల చేయడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇప్పుడు మాత్రం కే జి ఎఫ్ 2 సినిమా తో పోటీ పడేందుకు ముగ్గురు హీరోలు సిద్ధమైపోయారు.



 కే జి ఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అదే సమయంలో తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా కూడా విడుదల కాబోతూ ఉండడం గమనార్హం. ఇక ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక మరోవైపు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్చద్దా  సినిమా కూడా  ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయ్యేందుకు ఇప్పటికే డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో అటు టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉండడం గమనార్హం.



 ఇలా కే జి ఎఫ్ 2 విడుదలవుతున్న ఏప్రిల్ 14 వ రోజునే బీస్ట్, లాల్ సింగ్ చద్దా  సినిమాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి. అయితే కేజిఎఫ్ లాంటి సినిమా విడుదల అవుతున్న తరుణంలో బీస్ట్,  లాల్ సింగ్ చద్దా
 సినిమాలకు మైనస్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమా పై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఇక బీస్ట్, లాల్ సింగ్  చద్దా లాంటి సినిమాలను వాయిదా వేసుకుంటే బెటర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ ఇప్పటికే విడుదల డేట్ ఫిక్స్ చేయడంతో ఇక వాయిదా వేసుకునే అవకాశం కూడా లేదంటున్నారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న కే జి ఎఫ్ 2 సినిమా విజయ్ బీస్ట్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలకు షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: