ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కూడా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది. ఒకప్పుడు  సినిమాలు సీరియళ్లు మాత్రమే ప్రేక్షకులను అలరించేవి. కానీ ఇటీవలి కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఎంతోమంది ఓ టి టి వేదికగా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఇక అచ్చం ఇలాగే తెరకెక్కిన ఫామిలీ మాన్ వెబ్ సిరీస్ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.


 ఈ క్రమంలోనే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించడంతో ఇక దీనికి కొనసాగింపుగా రెండో పార్ట్ కూడా తెరకెక్కించారు.ఇక ఈ వెబ్ సిరీస్ లో  తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు అయిన సమంతా కీలక పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ప్రేక్షకులు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అంతేకాదు ఇక వెబ్ సిరీస్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్ కి దర్శకులు గా వ్యవహరించిన రాజ్ అండ్ డీకే ల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత ఇక ఇద్దరు దర్శకులు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ మాత్రం బయటికి రాలేదు.



 దీంతో ఇద్దరు దర్శకుల తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మరోసారి సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే సిద్ధమయ్యారని తెలుస్తోంది. కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, రాజ్ కుమార్ లను హీరోలుగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ లాగానే ఈ వెబ్ సిరీస్ కూడా సరికొత్తగా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో మ్యాజిక్ సృష్టించిన ఈ దర్శకులు ఇప్పుడు కామెడీ థ్రిల్లర్ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనేసరికి ఇక దీని పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: