సినిమా పరిశ్రమలో సక్సెస్ కు ఉన్న ప్రాధాన్యత మరే దేనికి ఉండదు అన్న విషయం అందరికీ తెలిసిందే. సక్సెస్ ఉంటే వారినీ అందలం ఎక్కిస్తూ ఉంటారు మన సినిమా వాళ్లు. హీరోలైన ఎవరైనా కూడా సక్సెస్ అనేది వారి వెంట ఉంటే తప్పకుండా అందరూ వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లకు వరుస సక్సెస్ లు సాధిస్తూ మరిన్ని సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకొని భారీ క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఆమె నటించిన తొలి సినిమా సూపర్ హిట్ అవడం మాత్రమే కాదు ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ ను తీసుకు వచ్చిన సినిమాగా మిగిలిపోయింది. ఆ విధంగా ఈమె తన తదుపరి సినిమా కూడా సూపర్ హిట్ చేసుకోవడంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ మొత్తం ఆమె వైపు చూసింది. హ్యాట్రిక్ హిట్స్ తో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లోనే భారీ డిమాండ్ నెలకొన్న హీరోయిన్ గా నిలిచింది అని చెప్పవచ్చు. 

ఇక సినిమా పరిశ్రమలో వరుస హిట్స్ సాధించుకుంటు పోతున్న మరొక హీరోయిన్ రష్మిక మందన. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ తరువాత పెద్ద హీరోలతో అవకాశాలు అందుకుని నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమెకు భారీ స్థాయి డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఆమె ఇటీవల నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.  ఇక వరుస హిట్స్ సాధించుకుంటూ పోతున్న మరొక హీరోయిన్ సాయి పల్లవి మలయాళం సినిమా పరిశ్రమ నుంచి తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నటిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది అనేది మన హీరోల నమ్మకం. అందుకే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: