మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ప్రతి ఒక్కరికి తెలుసు.. మహేష్ బాబు విజయాలకు కారణం ఈమె అని కూడా మహేష్ అభిమానులు భావిస్తూ ఉంటారు. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇక మహేష్ బాబు కూడా తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడేక్కడో ప్లాన్ చేస్తూ ప్రతి ఏడాది ఆమెకు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు.కానీ మహేష్ బాబు అన్న మరణించడంతో పుట్టినరోజు వేడుకలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నమ్రత బాలీవుడ్ లో మొదటిసారిగా హీరోయిన్ గా అడుగుపెట్టింది.. కానీ ఈమె ఇలా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందే మిస్ ఇండియా పోటీలో పాల్గొని విన్నర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మిస్ యూనివర్సిటీ పోటీలలో కూడా నమ్రత పాల్గొని తన సత్తాను చాటింది. మిస్ యూనివర్సిటీ లో ఈమె టాప్-6  స్థానం దక్కించుకుంది. ఇక అంతే కాకుండా మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లో కూడా నమ్రత సెకండ్ స్థానంలో నిలిచింది.ఇక నమ్రత మహేష్ బాబు కి ఎలా పరిచయం అయింది అంటే.. తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హీరోయిన్ గా వచ్చి బిజీగా మారుతున్నప్పుడే.. మహేష్ వంశీ సినిమా లో నటించే అవకాశం వచ్చింది.. కానీ మహేష్ బాబు అప్పుడు చాలా సింపుల్ గా సైలెంట్ గా ఉండేవాడు. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని దగ్గర అవడంతో వివాహం చేసుకున్నట్లు సమాచారం.అలా మహేష్ ను ఇష్టపడడం తో ఆమె సినిమాలకు దూరంగాఉంది.. ఆ తర్వాత 2005 న ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు.. వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.ప్రస్తుతం బిజినెస్ చేస్తూ చాలా బిజీగా ఉంది నమ్రత.. అయితే మహేష్ బాబు కంటే నమ్రత నే వయసులో పెద్దది. కేవలం నమృత రావడం వల్లే మహేష్ బాబు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: