నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'బింబిసార' అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కొత్త దర్శకుడు మల్లిడి వేణు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ కనబరచడమే కాకుండా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. కెరీర్ లో మొదటి సారి కళ్యాణ్ రామ్ ఈ ఈ సినిమాతో ఒక సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ దాదాపుగా ఖరారైంది.

ఫిబ్రవరి 4న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. అయితే  నిజానికి ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా విపత్కర పరిస్థితుల వల్ల చిత్ర యూనిట్ ఆచార్య సినిమా విడుదలను మరోసారి వాయిదా వేసింది. దీంతో ఆ డేట్ న నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో రాబోతున్నాడు. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసార అనే ఒక క్రూరమైన రాజుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు రెండు భాగాలుగా ఈ సినిమాని తీసుకొస్తున్నారు.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే కథ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ఈ సినిమా కోసం తన మేకోవర్ మొత్తాన్నే  పూర్తిగా మార్చుకున్నాడు ఈ నందమూరి హీరో. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి  ఫలితాన్ని అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: