నందమూరి హీరోల లో ఎన్టీఆర్ తర్వాత కొంత గుర్తింపు దక్కించుకుని ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు హీరో కళ్యాణ్ రామ్. సక్సెస్ రాకపోయినా కూడా ఈ హీరో వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఆ విధంగా తాజాగా రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. అలా చారిత్రాత్మక నేపథ్యంలో ఆయన బింబిసార అనే ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

సినిమా తప్పకుండా ప్రేక్షకులకు భారీ స్థాయిలో అలరిస్తుందని యూనిట్ చెబుతుంది. అంతేకాదు ఇప్పటికే వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఈ సినిమా పై ఏర్పరిచింది అని చెప్పవచ్చు. ఆవిధంగా పటాస్ సినిమా తర్వాత ఎటువంటి సక్సెస్ అందుకొని కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఈ సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ ఒకటవ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఇప్పుడిప్పుడే నిర్ణయించుకుంటుంది.

అయితే అదే నెలలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నడంతో ఆ విడుదల తేదీ అవసరమా అని కొంతమంది కళ్యాణ్ రామ్ కు సూచిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఆచార్య సినిమా కూడా విడుదల అవుతుంది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో సర్కారు వారి పాట అలాగే కే జి ఎఫ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హరి కూడా అదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ సినిమా ల మధ్య తనకు హిట్ ఇచ్చిన ఈ సమయంలో ఓ చారిత్రాత్మక నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను విడుదల చేయడం అవసరమా అని చెబుతున్నారు. ఈ మేరకు కళ్యాణ్ రామ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: