టాలీవుడ్ లో మ్యాన్లీ స్టార్ గా పేరు తెచ్చుకున్న జగపతి బాబు.. హీరో గానే కాకుండా ప్రస్తుతం విలన్ గా కూడా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొత్తం లోనే విలన్ గా బిజీ బిజీ గా మారుతున్నాడు ఈ సీనియర్ హీరో. అగ్ర హీరోల సినిమాల్లో మెయిన్ విలన్ గా నటిస్తూ మరోవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అందులో ముఖ్యంగా బోయపాటి గురించి మాట్లాడుతూ.. ఈయన ఎక్కువగా బూతులు మాట్లాడే వారని.. ఆల్కహాల్, సిగరెట్ లాంటివి మానేయడం మనకు ఎంత కష్టమో ఈయనకు బూతులు మానేయడం కూడా అంతే కష్టమని..

 అలాంటిది ఆయన బూతులు మాట్లాడకుండా ఇప్పుడు పూర్తిగా బంగారం అయిపోయాడని తెలియజేశాడు. ఇక రాజమౌళి గురించి చెప్తూ.. ఆయన ఒక పాత్రను డిజైన్ చేసే తీరు విలన్ ను పవర్ ఫుల్ గా చూపించే విధానం చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఇక కొరటాల శివ విషయానికి వస్తే.. ఇంతవరకు ఆయనకి ఫెయిల్యూర్ అనేది లేదని.. ఎందుకంటే ఆయన దగ్గర ముందుగానే 20 కథల వరకూ సిద్ధంగా ఉన్నాయని.. ఆయన ఆలోచన విధానం చాలా బాగుంటుందని అని చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతని ఐడియాలజీ తనకు చాలా దగ్గరగా అనిపిస్తుందని.. ఎంత పెద్ద సీన్ అయినా సరే చాలా సింపుల్గా చెప్పస్తారని..

ఇప్పటికీ కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తారు, లేదంటే ఆ తర్వాత తనే కాల్ చేస్తాడు. నూటికి 99% ఏ డైరెక్టర్స్ ఇలా చేయరు. కానీ పూరి అలా కాదు సినిమా చేసినా చేయకపోయినా మనిషి బంగారం అని చెప్పాడు. ఇక ముఖ్యంగా సుకుమార్ గురించి చెబుతూ.. సుకుమార్ అల్టిమేట్ డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్ కి ప్రాణాలైనా ఇవ్వచ్చు అని తెలియజేశాడు. ఒక మనిషిగా నాకు ఆయనంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు జగపతి బాబు. దీంతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై జగపతి బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: