నాచురల్ స్టార్ నాని ఈ మధ్యనే విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు,  ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించగా మరో ముఖ్యమైన పాత్రలో మడోన్నా సెబాస్టియన్ నటించింది. శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి అనే సినిమాలో నటిస్తున్నాడు, ఈ మూవీ తో  నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ మూవీ తర్వాత నాని 'దసరా' సినిమాను లైన్ లో పెట్టేశాడు .. .. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ కి  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు, తెలంగాణ లోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన నేపథ్యంలో ఈ కథ నడవబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ లో నాని తెలంగాణ యాసలోనే మాట్లాడతాడట, అందుకోసం నాని ట్యూటర్ ను పెట్టుకుని ఆ యాసను ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దసరా సినిమాలో నాని పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉండనుందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఈ సినిమాను మలయాళం లో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, అందుకోసం మలయాళానికి చెందిన యువ నటుడు రోషన్ మాథ్యూని ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ లో సాయికుమార్ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇలా ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని  'అంటే సుందరానికి' 'దసరా' సినిమాలలో నటిస్తున్నాడు, మరి ఈ సినిమాలతో నాని ఎలాంటి విజయాలను అనుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: