టాలీవుడ్ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా ఈ మధ్య హీరోలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.వారిలో అధిక సంఖ్యలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇంత మంది హీరోల మధ్యలో ఆ హీరో ఇప్పటికి ఇండస్ట్రీలో ఎలా నిలద్రొక్కుకున్నాడు , అసలు అతని నేపథ్యం ఏమిటి ? అతని తండ్రి ఎవరు ? ఇవ్వన్నీ తెలియాలంటే చదవండి .

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంతో మంది హీరోలు ఉన్న యాంగ్రీ యాంగ్ మ్యాన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో గోపిచంద్ ది ప్రత్యేక శైలి . రష్యా లో ఇంజినీరింగ్ చదివి తొలుత హీరో నుంచి విలన్ గా మారి మళ్ళీ హీరోగా పరిశ్రమ లో నిలద్రొక్కుకున్న ఏకైక యువ హీరో. సుమారు 2 దశాబ్దాలుగా నటుడిగా తన ప్రయాణం సాగిస్తున్న ఇతని వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికి చాలా మందికి తెలియదు. 

గోపిచంద్ పూర్తి పేరు తొట్టెంపూడి గోపిచంద్ , ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కాకుటూరివారి పాలెం స్వగ్రామం. గోపిచంద్ పుట్టింది మాత్రం టంగుటూరు. గోపిచంద్ కుటుంబ నేపథ్యంలో కి వెళితే  ఈయన తాత గారు పొగాకు వ్యాపారం లో మంచి పేరున్న వ్యాపారవేత్త,  తండ్రి స్వర్గీయ టి. కృష్ణ గారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాటి సుప్రసిద్ధ దర్శకుల్లో ఒకరు. 

గోపిచంద్ తండ్రి టి.కృష్ణ గారు తొలుత ఒంగోలులో శర్మ కళాశాలలో చదువుతున్న సమయంలోనే వామపక్ష భావజాలం పట్ల మక్కువ పెంచుకొని వారి అన్నగా ప్రసిద్ధి చెందిన నల్లూరి వేకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా నాటక మండలి లో చేరారు. అక్కడ మరో యువకుడు , తర్వాత కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రెడ్ స్టార్ గా గుర్తింపు పొందిన మాదాల రంగా రావు తో కలిసి నాటకాలు వేసేవారు.  

కృష్ణ తొలుత నటుడు గా మారాలని చెన్నై వెళ్లిన సరైన అవకాశాలు రాకపోవడంతో దర్శకుడు గా మారి తీసిన మొదటి చిత్రం నేటి భారతం ఆరోజుల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తరవాత ఆయన దర్శకత్వంలో వచ్చిన వందేమాతరం, దేవాలయం వంటి చిత్రాలు ఆనాటి యువతను ఉర్రుతలుగించాయి. ముఖ్యంగా విజయశాంతి తో తీసిన ప్రతిఘటన చిత్రం అయితే భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. 

కృష్ణ మొత్తం తీసింది కేవలం 8 చిత్రాలు కాగా వాటిలో పరాజయం అనేది లేకపోవడం విశేషం. ఆనాటి అగ్రకథానాయికులు సైతం కృష్ణ దర్శకత్వం లో నటించాలని ఉవ్విళ్లూరరూ కానీ క్యాన్సర్ కారణంగా కేవలం 36 ఏళ్లకే మరణించారు. కృష్ణ మరణించిన తర్వాత గోపిచంద్ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడిన వారి కుటుంబ శ్రేయోభిలాషుల కారణంగా మెరుగయ్యారు. తండ్రి స్పూర్తితో సినిమాల్లో కి వచ్చిన గోపిచంద్ తన తండ్రి కి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: