సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది,  ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఏప్రిల్ ఒకటోవ  తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది,  ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా పూర్తి అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  

సూపర్ స్టార్ మహేష్ బాబు,  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా షూటింగ్ ఏప్రిల్లో నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పూర్తయిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: