యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగించాడు, ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరొక హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది, అందుకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను పాన్ ఇండియా రేంజ్ లో చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయకుండా సినిమా విడుదలను వాయిదా వేశారు,  అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.  ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ ముగించుకోవడంతో తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది,  అందులో భాగంగా ఎన్టీఆర్,  కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమాలో నటించబోతున్న విషయం మన  అందరికి తెలిసిందే.

ఇక వచ్చేనెల ఫస్టువీక్ లో ఈ మూవీ ని లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగా ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది, ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30 వ సినిమా.  ఇక ఈ మూవీ లో కథానాయికలుగా జాన్వీ కపూర్, అలియా భట్, కీర్తి సురేశ్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి.  మరి వీరిలో ఎవరినైనా హీరోయిన్ గా తీసుకుంటారా లేక మరెవరినైనా తీసుకుంటారనేది సినిమా లాంచ్ ఈవెంట్ రోజు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జూనియర్, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం గా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: