హీరో నాగచైతన్య చూడడానికి ఎంతో సాఫ్ట్ గా కనిపిస్తున్నప్పటికీ.. తనకి బైక్లను, కార్లను.. స్పీడ్ గా తోలడం అంటే చాలా ఇష్టమట.. ఇక మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తన వేగాన్ని కాస్త తగ్గించుకున్నానని.. కానీ వాటి మీద ప్రేమ మాత్రం తగ్గలేదని తెలియజేశాడు. మార్కెట్లోకి కొత్తగా విడుదలైన కార్లు, బైకులను తీసుకోవడం చాలా ఇష్టం అని తెలియజేశారు. అందుకోసమే అప్పుడప్పుడు ఏదైనా కార్ల ఓపెనింగ్ చేసే వేడుకల్లో కనిపిస్తూ ఉంటానని చైతన్య తెలిపారు. ఇక అంతే కాకుండా మూవీలలో కార్లను, బైకుల లో చేసే సన్నివేశాలు అంటే తెగ ఇష్టపడి చేసేస్తానని చెప్పుకొచ్చాడు చైతన్య.


గతంలో  కూడా ఖరీదైన కారును కొనుగోలు చేసి.. దానిని తనకు అనుగుణంగా మార్చుకొని రీమోడలింగ్ చేయించుకున్నాడు అన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాదా.. నాగచైతన్య మాట్లాడుతూ.. చైతన్య బర్తడే కి తన తండ్రి ఒక కారు ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ కార్ ను తన టేస్ట్ కి తగినట్లు మార్చుకున్నారని తెలియజేశాడు. జపాన్ నుంచి దానికి సంబంధించిన కొన్ని పార్ట్స్ తెప్పించి.. మార్చేసుకున్నాను అని తెలియజేశాడు. అంతేకాకుండా కార్లు, బైక్ ల ప్రపంచం అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా తెలియజేశారు.

సినిమాల తర్వాత ఇష్టపడే వాటిలో ముందు ఇదే ఉంటుంది అని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా మార్కెట్లోకి విడుదలైన కొత్త వాహనాల గురించి బాగా తెలుసుకుంటూ ఉంటాను అని తెలియజేశాడు నాగచైతన్య. ఇక నాగార్జున కూడా మాట్లాడుతూ తనకు కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం అని తెలియజేశాడు.. కానీ వీటి కంటే ముందు నాకు ఎక్కువగా సైకిల్ పైన తిరగడం చాలా ఇష్టం అని తెలియజేశాడు. కాలేజీకి వెళ్లే సమయాలలో ఎక్కువగా సైకిల్ పైన వెళ్లే వాడిని అని తెలియజేశాడు. ప్రస్తుతం అయితే అందరూ ఎక్కువగా కార్లను ఉపయోగిస్తున్నారని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: