యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు, ఆ తర్వాత కూడా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్, అంతకుమించిన సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు, అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే స్థాయిలో విడుదల కూడా చేశాడు, ఈ సినిమా టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించింది. ఇలా వరుస సినిమాల్లో నడుస్తూ వస్తున్న ప్రభాస్ అందులో భాగంగా ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాను ఇప్పటికే పూర్తి చేశాడు, ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా ఉద్ధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు, ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇప్పటివరకు ప్రకటించలేదు.

ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.   ప్రభాస్ ఈ సినిమాతో పాటు  సలార్, ఆది పురుష్, సినిమాల షూటింగ్ లను కూడా దాదాపుగా ముగించేశాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ 'ప్రాజెక్టు కే' అనే సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' అనే  సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఇప్పటికే ఐదు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ డి వి వి దానయ్య బ్యానర్ లో ఒక సినిమాకు, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాకు, దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే కనుక నిజమైతే ప్రభాస్ చేతిలో మొత్తంగా ఎనిమిది సినిమాలు ఉన్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: