మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నింటినీ  ముగించు కున్నాడు, ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది,  అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రమోషన్ లలో కూడా రామ్ చరణ్  పాన్ ఇండియా రేంజ్ లో పాల్గొన్నాడు. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు,  అయితే తాజాగా ఈ సినిమాను మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

 అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పనులను రామ్ చరణ్ ముగించుకోవడంతో తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్న విషయం  మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే సునీల్, అంజలి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, శంకర్  సినిమాలో పాటలకు, వాటి చిత్రీకరణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెలిసిందే, పాటలను తెరకెక్కించడంలో శంకర్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తు ఉంటాడు, అయితే రామ్ చరణ్ సినిమాలో కూడా ఒక పాటను అదే రేంజ్ లో చిత్రీకరించడం కోసం దాదాపుగా 25 కోట్లు ఖర్చు పెట్టి ఒక సాంగ్ ను శంకర్ చిత్రీకరిస్తున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: