పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో కోటి ఆశలతో ఎంతగానో ఎదురు చూస్తున్నారు . వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ రచయత కావడం పవన్ ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం పట్ల ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఈ సినిమా మీద భారీ స్థాయిలో నమ్మకం ఉన్నందువల్లనే పవన్ కళ్యాణ్ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

దీనికితోడు ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండటం తో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది అని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. కొన్ని ప్యాచ్ వర్క్ కూడా మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. ఆ విధంగా ఈ సినిమా ఫిబ్రవరి 24వ తేదీన విడుదల అవుతుంది అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ పెద్ద సినిమాలు విడుదల ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు.

అలా ఫిబ్రవరి 24వ తేదీన ఈ చిత్రం విడుదల కావడానికి సిద్ధం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఆ విడుదల తేదీని కూడా మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. కారణమైతే ఇప్పటివరకు తెలియదు కానీ ఏప్రిల్ ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నాడట. అయితే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను ఆ రోజు విడుదల చేయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకున్నాడు అని మెగా అభిమానులు చెబుతున్నారు. మరి దీని మీద ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: