ఇటీవల కాలంలో మన దర్శక నిర్మాతలు వారు చేసే సినిమాల కథలను మాత్రమే కాదు దానికి సంబందించిన ప్రతీది కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. ఆ విధంగా టైటిల్స్ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. గత కొంతకాలంగా మన దర్శకులు తమ సినిమాలకు టైటిల్స్ వెరైటీ గా ఉంచడంతో పాటు హీరో ల రేంజ్ పెంచే విధంగా భారీ స్థాయిలో ఉంటున్నాయని చెప్పవచ్చు. ఆ విధంగా టాలీవుడ్ లో ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆసక్తి పరుస్తున్న టైటిల్స్ ఏంటో చూద్దాం.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఇండియా చిత్రం లైగర్. ఈ  టైటిల్ ఎంతో వినుత్నం గా  ఉండటంతో పాటు కొందరిలో ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తిని పెంచింది అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇలా ఉండడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెబుతున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే పూరి జగన్నాథ్ తన సినిమాలకు వెరైటీ టైటిల్స్ పెడతారన్న పేరు మొదటి నుంచి ఉంది. ఆ విధంగానే ఈ సినిమాకి కూడా ఆయన ప్రేక్షకుల ఊహకందని టైటిల్స్ పెడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు చెబుతున్నారు.

ఇక ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తున్న మరొక సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండగా ఈ టైటిల్ తో ఎంతో ఆసక్తిని రేపుతోంది అని చెప్పవచ్చు. ఇక మహేష్ సర్కారు వారి పాట  టైటిల్ చాలా వెరైటీ గా ఉందని సాధారణ ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆకర్షించేలా ఈ టైటిల్స్ ను బాగా పెట్టారని దర్శకులను కొంత మంది పొగడ్తలలో చేశారు కూడా. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎఫ్ త్రీ సినిమా టైటిల్ కూడా ఎంతో విభిన్నంగా ఉందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: