వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు లతో సతమతమవుతున్న హీరో నాని కి శ్యాం సింగ రాయ్  అనే చిత్రంతో హిట్ తెచ్చి పెట్టింది. కాన్ఫిడెన్స్ కోల్పోయిన నాని కి ఇది   ఫామ్లోకి వచ్చేలా చేసింది అని చెప్పాలి. ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది అని చెప్పాలి. అంతే కాదు నాని నటన ను కూడా సరికొత్త విధానంలో చూపించిన సినిమా ఇది. అయితే ఈ సినిమా సక్సెస్ అయిందో లేదో నాని తెగ సంబరాలు చేసుకున్నారు అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత విజయాన్ని తీసుకు వచ్చిన సినిమా కావడంతో ఆయన ఈ సినిమా తో కొన్ని ప్రయోగాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు జోరు బాగా ఉంది. నాని ఆ సినిమాలు తీయక పోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఆయన పాన్ ఇండియా సినిమా చేయాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే  ఇప్పుడు రాబోయే సినిమాలో అయినా ఆయన అలాంటి సినిమాలు చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండగా అవి తెలుగుకు మాత్రమే పరిమితమైన సినిమాలు అని తేలడంతో వారందరూ కూడా నిరాశ పడుతున్నారు.

అయితే నాని పాన్ ఇండియా సినిమాలు అయితే చేయడం లేదు గానీ తన సినిమాలు అన్ని భాషలలో విడుదల అయ్యే విధంగా చూసుకుంటున్నాడు తెలుగులో సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నాడు నాని. ఇప్పుడు ఈ చిత్రం విషయంలో అదే జరిగింది అని తెలుస్తుంది. తమిల పరిశ్రమలో ఈ చిత్రాన్ని విడుదల చేయగా ఇప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసి అక్కడ గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు తొందరలోనే హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది ఆవిధంగా నాని పాన్ ఇండియా హీరో అయ్యే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: