అఖండ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్ ప్రేక్షకులను తన సినిమాలతో విపరీతంగా అలరించే బోయపాటి శ్రీను ఇప్పుడు అఖండ సినిమాతో మాస్ జాతర కొనసాగించారని చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణ ను  భారీ స్థాయిలో ఎలివేట్ అయ్యే విధంగా ఈ సినిమా చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయితే ఆ స్థాయి వేరే ఉండేదని ఇప్పుడు ఆయన అభిమానులు చెబుతున్నారు.

దాంతో తన తదుపరి చేయబోయే సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో చేయాలని బోయపాటి శీను కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఆయనలో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని చెప్పవచ్చు. దీనికి ముందు వినయ విధేయ రామ చాలా అవమానాల పాలు అయ్యాడు బోయపాటి శ్రీను. అలా ఆ చిత్రం ఆయనలో కసి పెరిగేలా ఉపయోగ పడింది. దాంతో అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో ఒకసారిగా ఆయనకు పెద్ద హీరోల దగ్గర నుంచి పిలుపు వస్తున్నాయట.

ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు అప్పట్లో రాగా ఇప్పుడు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలియడంతో బోయపాటి శ్రీను తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీనికి తోడు బోయపాటి శ్రీను కూడా తన తదుపరి సినిమా గురించి ఏ విధమైన అప్డేట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను మొదలు పెడుతున్నాడు అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎంతో నెలకొంది. మరి వార్తలు వచ్చినట్లు ఆయన అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేస్తాడా లేదా మరొక వేరొక హీరోను చూసుకుంటాడా అనేది చూడాలి. ఆయనతో సినిమా చేయడానికి ఇప్పుడు టాప్ హీరోలు అందరు సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: