టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోతే హీరోయిన్ లకు ఏం చేయాలో ఏ మాత్రం అర్థం కాదు. చేతిలో సినిమాలు లేకపోతే దాదాపుగా వారి కెరీర్ అయిపోయినట్లే అని చెప్పాలి. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ లో ఎందింగ్ దశలో ఉంది రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్.  ఇప్పుడు ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అని చెప్పాలి. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు ఇప్పుడు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఈమె అప్పుడే సినిమాల నుంచి దూరం అయిపోవడం ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశపరుస్తుంది. 

మొదటినుంచి గ్లామర్ తో పాటు మంచి నటన కనబరిచిన ఈమె కొండపొలం సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అని చెప్పాలి. అప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయగా అప్పటికి సమయం దాటిపోవడంతో కొత్త హీరోయిన్లు తమ గ్లామర్ తో అలరిస్తూ ఉండడంతో రకుల్ ను  పట్టించుకోవడం మానేశారు మన దర్శక నిర్మాతలు ఆ విధంగా కనుమరుగైపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇతర భాషలలో సైతం ఆమెకు అవకాశాలు సన్నగిల్లడంతో ఇప్పుడు ఆమె బిజినెస్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ ఏజెన్సీని నెలకొల్పే విధంగా ఈమె ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏజెన్సీ ద్వారా కొత్త నటీనటులకు సినిమా అవకాశాలు ఇప్పించే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తుందట. ఏదేమైనా సినిమా మీద ఉన్న ఇంటరెస్ట్ తో సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమా అవకాశాలు రాకపోయినా సినిమా ఇండస్ట్రీ లోనే ఉండాలని రకుల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని చెప్పాలి మరి ఈ బిజినెస్ లో ఆమె భారీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాము.

మరింత సమాచారం తెలుసుకోండి: