కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా ను సెట్స్ పైకి తీసుకు వెళ్లే పనిలో  ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఆచార్య సినిమా విడుదల పోస్ట్పోన్ కావడంతో ఆయన ఈ సినిమాను మరింత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇటు ఎన్టీఆర్ కూడా తన ఆర్ ఆర్ ఆర్ సినిమా పనీలో బిజీగా ఉండడంతో ఈ సినిమా మొదలు పెట్టడానికి ఇంత సమయం పట్టింది. తొందర్లోనే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా గ్రాండ్ గా మొదలు పెట్టి షూటింగ్ కు వెళ్ల బోతున్నారట.

కమర్షియల్ సినిమాలకు మెసేజ్ ను జోడించి ఎంతో చక్కగా సినిమాలు చేసే కొరటాల శివ ఈ సినిమాను సైతం ఎంతో అద్భుతమైన కథతో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా రాగా దానిలగానే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కాంబినేషన్ లు కుదరవు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా సదరు కాంబినేషన్లోని సినిమా క్యాన్సిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కొరటాల శివ రామ్ చరణ్ సినిమా.

ఏ దర్శకుడైనా మంచి సక్సెస్ సాధించి భారీ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు అంటే రామ్ చరణ్ తప్పకుండా ఆ దర్శకుడితో కలిసి తనతో సినిమా చేయవలసిందిగా కోరతాడు అలా కొరటాల శివ భరత్ అను నేను సినిమా సూపర్ హిట్ సాధించిన తర్వాత తనతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు.  ఆయన కూడా మంచి స్క్రిప్ట్ తయారుచేసి చరణ్ తో ఓకే చేయించుకున్నాడు అయితే ఆ తర్వాత సినిమా క్యాన్సిల్ అవడం  వీరి అభిమానులను తీవ్రమైన నిరాశ పరిచింది. కథ సరిగ్గా కుదరక పోవడం వల్లనే ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నారు.. ఇప్పుడు తాను చేస్తున్న ఎన్టీఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: