ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సమంత మాత్రం తన బిజినెస్ ని ఇంకా పెంచుకుంటూ వెళ్తుంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత సాకి అనే క్లాత్ బ్రాండింగ్ స్టార్ట్ చేసింది. సాకీ బ్రాండ్ తో సమంత తన సత్తా చాటుతుంది. ఇప్పటికే ఈ బ్రాండ్ సూపర్ సక్సెస్ అవగా ఇప్పుడు సమంత ఈ బ్రాండ్ ని ఎక్స్ పాండ్ చేస్తుంది. సాకీ ని కొనసాగిస్తూ సాకీ గల్స్ అని కొత్త ప్రయత్నం చేస్తుంది.

ఇన్నాళ్లు సాకీ క్లాత్ బ్రాండ్ లేడీస్ కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు సమంత తన బ్రాండ్ ని పిల్లలకి కూడా అందించాలని చూస్తుంది. సాకీ గాల్స్ అంటూ మరో కొత్త ప్రయోగం చేస్తుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సమంత మాత్రం బిజినెస్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని చూస్తుంది.

ఇక సమంత చేస్తున్న క్రేజీ మూవీస్ విషయానికి వస్తే గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం. హరి, హరీష్ డైరక్షన్ లో యశోద సినిమా చేస్తుంది. ఇక మరోపక్క బాలీవుడ్ లో కూడా అమ్మడు వరుస వెబ్ సీరీస్ లు చేస్తూ తన స్టామినా ప్రూవ్ చేసుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ తో బాలీవుడ్డ్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సమంత ఇక మీదట అక్కడ పూర్తి ఫోకస్ పెట్టాలని చూస్తుంది. లేటెస్ట్ గా టీ సీరీస్ తో ఓ భారీ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుందని టాక్. సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆమెని మరింత సక్సెస్ బాటలో నడిపించేలా ఉన్నాయి. సమంత సాకీ బ్రాండ్ తో వస్తున్న ఈ కిడ్స్ సెక్షన్ ఎలాంటి సేల్స్ తెచ్చుకుంటుందో చూడాలి.  డైవర్స్ తర్వాత సమంత దూకుడు చూసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: