కీర్తి సురేష్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న గొప్ప మహానటి కీర్తిసురేష్. ఈమె ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అంతేకాదు ఈ పాత్రలో నటించి.. కీర్తి సురేష్ తప్ప మరెవరూ నటించలేరు అన్నట్టుగా చెరగని ముద్ర వేసుకుంది. ఇక మహానటి సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.. తమిళ్, తెలుగు అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటోంది కీర్తి సురేష్..


ఇకపోతే ఈమె పాత్ర నచ్చితే చెల్లెలి పాత్రలో నటించడానికి కూడా వెనకాడడం లేదు అని మనకు అన్నత్తే.. భోళా శంకర్ సినిమాలు గురించి తెలిస్తే తెలిసిపోతుంది.. ఒకవైపు చెల్లెలిగా మరొకవైపు హీరోయిన్గా ఇంకొకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే తాజాగా గుడ్ లక్ సఖి అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుండగా .. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గుడ్ లక్ సఖి అనే ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను రేపు అనగా జనవరి 24వ తేదీన ఉదయం 10:11నిమిషాల కు విడుదల చేయబోతున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా అధికారికంగా విడుదల చేసే ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాను జనవరి 28వ తేదీన థియేటర్లలో ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: