సూర్య కథానాయకుడిగా టీజే జానవెల్ డైరెక్ట్ చేసిన సినిమా జై భీమ్. సూర్య తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో ఈ మూవీ నిర్మించారు. ఓ అనగారిన కుటుంబానికి నష్టం జరిగితే ఓ నిస్వార్ధ మైన న్యాయవాది వారికి న్యాయం జరిగేలా ఎలా చేశాడు అన్నది జై భీమ్ మూవీ కథ. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ మిస్సై అమేజాన్ ప్రైం లో రిలీజైంది. అయితే ఈ సినిమ ప్రైం లో రిలీజైనా సూపర్ హిట్ అయ్యింది. సినిమాకు ఐడిఎంబి 9.8 రేటింగ్ ఇచ్చింది. ఇది చాలా గొప్ప రికార్డ్ అని చెప్పొచ్చు.

ఇక లేటెస్ట్ గా జై భీమ్ ఆస్కార్ బరిలో కూడా నిలిచిందని తెలిసిందే. ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ సినిమాకు సంబందించిన సీన్స్ పోస్ట్ చేశారు. జై భీమ్ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇండియాలోనే కాదు చైనాలో కూడ్డా చాలా పెద్ద విజయం అందుకుందని తెలుస్తుంది. ఇటీవల చైనాలో కూడా జై భీమ్ మూవీ రిలీజ్ చేశారట. అయితే అక్కడ కూడ్డా సినిమాకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది. చైనాలో సూర్య సినిమా జై భీమ్ కి అక్కడ మీడియా 8.7 రేటింగ్ ఇచ్చారు. చైనాలో ఆ రేటింగ్ అంటే చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమాకు చైనా ఆడియెన్స్ అంతగా కనెక్ట్ అవడానికి ప్రధాన కారణం జపాన్ లో హత్యకు గురైన తన కూతురికి న్యాయం కావాలని చైనాకి చెందిన ఓ మదర్ చేసిన పోరాటం కూడా జై భీమ్ సినిమా కథని పోలి ఉన్నదట. అందుకే అక్కడ ఆడియెన్స్ కి కూడా బాగ దగ్గరైంది. జై భీమ్ సినిమా చైనాలో సాధిచించిన విజయానికి సూర్య అండ్ టీం చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య తన నెక్స్ట్ సినిమా ఈటీ సినిమాతో వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: