త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తొందరలోనే సినిమాను మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాబోతున్నడంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. తన రచనలతో దర్శకత్వంతో ఇప్పటివరకు ఎంతగానో అలరిస్తూ వచ్చిన త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. 

హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ను తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను చూసి పూర్తి చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ను సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది. అతడు, ఖలేజా సినిమాలతో మహేష్ కు మంచి ఇమేజ్ క్రేజ్ క్రియేట్ చేసి భారీ స్థాయిలో ఆయన హీరోగా ఎదగడానికి సహాయపడ్డాడు. ఇప్పుడు ఆయన కున్న ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా ఈ సినిమా చేస్తున్నాడట. ఏదేమైనా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా రావాలని కోరుకున్న ప్రేక్షకులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 

ఇకపోతే ఈ సినిమా అతడు సినిమా కి కొనసాగింపు లాగా ఉండబోతుంది అనేది ఇన్సైడ్ వర్గాల సమాచారం టైటిల్ గా పార్థు అనే పేరుని పరిశీలిస్తున్నారట. ఈ పేరు అతడు సినిమాలోని మహేష్ బాబు పాత్ర పేరు. ఆ విధంగా ఆ పాత్ర పేరును మాత్రమే కాదు ఆ పాత్ర యొక్క హావభావాలను కూడా తీసుకుని ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడట త్రివిక్రమ్. ఇది ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందని అసలు విషయం. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. 

మరింత సమాచారం తెలుసుకోండి: