విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ గా వైరల్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ గురించి ఇప్పుడు భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మొదటి నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి హిందీలో కూడా ఈ సినిమా విడుదల అవుతూ ఉండడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తూ ఉండడం విశేషం. ఆవిధంగా ఎన్నో ప్రాధాన్యతలను సంతరించుకున్న ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఈ చిత్ర బృందం వ్యక్త పరుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు ప్రేక్షకుల ముందుకు రాగా వాటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కడం విశేషం. ఇటీవలే వచ్చిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రాగా దీన్ని బట్టే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టని కూడా అందరూ ఇప్పటికే నిర్ణయం చేశారు.

తాజాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం వరల్డ్ బ్యూటీ ని ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు సమంత తో ఈ ఐటమ్ సాంగ్ చేయబోతున్నారట యూనిట్.  ఇటీవలే పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమాకు అంత పెద్ద గుర్తింపు రావడానికి కారణం ఈ ఐటమ్ సాంగ్. అయతే సమంత ఐటమ్ సాంగ్ చేయడం కూడా ఆ పాట అంత పెద్ద హిట్ అవడానికి ముఖ్య కారణం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ చేయడం విశేషం గా మారింది. దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: