మాస్ రాజా రవితేజ ఇప్పుడు వరుస సినిమాలలో చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా చేస్తున్న ఖిలాడి చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గా చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రాక్ సినిమా తర్వాత ఆయన హీరోగా చేసిన  చిత్రం సూపర్ హిట్ కావడం ఖాయం అని ఒక్క సారిగా ఆయన అభిమానులను తెగ సంతోష పడుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా చేసిన రామారావు ఆన్ డ్యూటీ అదే చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది .

ఆ విధంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు సినిమాలను విడుదల చేస్తూ ఉండడం విశేషం. అయితే ఈ రెండు సినిమాల షూటింగులు అలా అయిపోయాయో లేదో రవితేజ అప్పుడే తాను తదుపరి చేయబోయే రెండు సినిమాలను అనౌన్స్మెంట్లు చేశాడు. తదుపరి సినిమా గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా చిత్రం చేస్తున్న రవితేజ రావణాసుర అనే మరొక సినిమా కూడా ఇప్పటికే మొదలుపెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తూండగా రవితేజ ఇప్పుడు ఆ మాత్రమే కాకుండా మరో విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే రవితేజ ఇలా వరుసగా సినిమాలు చేయడం పట్ల ఆయన కమర్షియల్ గా ఆలోచిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సినిమా విశ్లేషకుల లో. ఏ సినిమా అయితే ఏంటి భారీ స్థాయిలో పారితోషికం తీసుకుని దానిలో నటించడమే లక్ష్యంగా ఇలా వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు రవితేజ అని అంటున్నారు. అయితే రవితేజ కేవలం డబ్బు కోసమే సినిమాలను చేయడం కాకుండా ప్యాషన్ కోసం చేయాలని అంటున్నారు. డబ్బు కోసం చేయడం అనే వార్తలు రావడం పట్ల కొంత మంది అభిమానులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. మంచి సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాలని కానీ ఈ విధంగా సినిమాలు డబ్బుకోసమే చేయడం మంచిది కాదని కూడా వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: