నందమూరి బాలకృష్ణ ఒక మధ్యతరగతి రైతుగా అలానే అఘోరాగా రెండు రకాల విభిన్న పాత్రల్లో కనిపించిన లేటెస్ట్ మూవీ అఖండ. ఎప్పటినుండో కెరీర్ పరంగా మంచి సక్సెస్ కోసం చూస్తున్న బాలయ్యకి అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ మంచి ఊపునిచ్చింది. మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా కనిపించారు. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో గ్రాండ్ గా నిర్మించిన అఖండ రిలీజ్ అయిన దాదాపుగా అనేక కేంద్రాల్లో మంచి కలెక్షన్ రాబట్టి ఇటీవల సక్సెసుల్ గా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

గతంలో వచ్చిన సింహా, లెజెండ్ తరువాత ప్రస్తుతం అఖండ సూపర్ సక్సెస్ తో తామిద్దరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టాం అని, రాబోయే రోజుల్లో బోయపాటితో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు 50 రోజుల వేడుకలో బాలయ్య చెప్పారు. ఇక విషయంలోకి వెళ్తే ఈ సినిమా పై ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు సైతం ప్రశంసలు కురిపించిన పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ముఖ్యంగా అఖండ సినిమాలోని ఒక కీలక సీన్ లో బాలయ్య హీరోయిన్ ప్రగ్యని జీప్ లో ఎక్కించుకుని డ్రైవ్ చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ త్రుటిలో తప్పుతుంది, ఆ సమయంలో ప్రగ్య సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో అనంతరం బాలయ్య ఆమెకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, తప్పకుండా మన భద్రత మర్చిపోకూడదని చెప్పిన డైలాగ్ పోస్టర్ ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ రోడ్డు భద్రతని గుర్తు చేసిన సన్నివేశాన్ని సినిమాలో పెట్టినందుకు చిత్ర యూనిట్ ని అభినందించారు. మొత్తంగా అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ ప్రశంసలు దక్కించుకుంటూ అఖండ నిజమైన సక్సెస్ ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: