ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ నేషనల్ లెవెల్ కి చేరుకుంది. ఇప్పటివరకు తెలుగు, మలయాళం ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైన బన్నీ..  పుష్ప సినిమాతో నార్త్ లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి అసలు విడుదల చేద్దామా? వద్దా? అని సందిగ్ధం లో ఉంటూనే హిందీలో విడుదల చేశారు. కట్ చేస్తే.. ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది పుష్ప సినిమా. ఈ సినిమాతో హిందీ డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 50 కోట్లకు పైగా లాభం వచ్చింది. దీంతో పుష్ప పార్ట్ 2 కి ఏకంగా వంద కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే బన్నీతో సినిమా చేయడానికి ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్లు ఇద్దరు లైన్ లో ఉన్నారు. 

ఆ ఇద్దరిలో ఒకరు స్టార్ డైరెక్టర్ మురుగదాస్. ఇంకొకరు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ. అయితే వీరిలో కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురగదాస్ ఇప్పటికే అల్లు అర్జున్ కి స్టొరీ ని నెరేట్ చేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా డైరెక్టర్ కి క్లారిటీ ఇవ్వలేదట. అయితే ఇప్పుడు తాజాగా మురుగదాస్ కంటే ముందు అట్లీతో సినిమా చేయడానికి అల్లుఅర్జున్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోయె క్రేజీ ప్రాజెక్ట్ కి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ ఈ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అయితే ఆ సినిమా తర్వాత బన్నీ మురగదాస్ తో సినిమా చేస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే సౌత్ లో ఇళయదళపతి విజయ్ తో తేరీ, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన అట్లీ.. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందట వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: