హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి వరుస డిజాస్టర్ లు అందుకున్న అక్కినేని అఖిల్ ఈమధ్య 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో ఎట్టకేలకు కెరియర్ లో మొట్టమొదటి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు చూసి సినిమా ఫ్లాప్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ దసరా సెలవులు వల్ల ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేర్పులు చేశారు. ఎందుకంటే దిల్ రాజు నిర్మించిన 'షాదీ ముబారక్' అనే సినిమా కథ కూడా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కథలా ఉండడంతో దర్శకనిర్మాతలు అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

ఇక ఫైనల్ కాఫీ ఓకే అనిపించుకున్నాకే మాత్రమే రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే ఇప్పుడు అఖిల్ తదుపరి సినిమా అయిన 'ఏజెంట్' సినిమా కూడా మళ్లీ రీ షూట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏజెంట్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు మొదలయ్యాయని సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 20 శాతానికి పైగా పూర్తయింది. అయితే ఆ మధ్య కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఇప్పటివరకు రషెస్ చూసిన సురేందర్ రెడ్డి మరియు మూవీ టీం హీరో క్యారెక్టరైజేషన్ లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుందని అనుకున్నారట.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అఖిల్ సినిమాకు ప్రతిసారీ కష్టాలు తప్పడం లేదని ఫాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అవడమే కాకుండా కండలు తిరిగిన భారీ దేహంతో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఏజెంట్ ఈ మేరకు అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: